సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ మాత కి జై.. పాకిస్తాన్ లో పేరుకుపోయిన మతోన్మాద ఉగ్రవాద తుప్పు ను భారత్ తన క్షిపణి దాడులతో వదిలిస్తుంది. 26 మంది భారతీయ హిందూ మహిళల భర్తలను చంపిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పటానికి భారతీయ హిందూ మహిళల నుదుట పెట్టుకొనే సిందూరం పేరుతొ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వెంటనే అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కి ఫోన్ చేసే యుద్ధం ఆపమని కోరితే, భారత్ యుద్ధం త్వరగా ముగియాలని కోరుకొంటున్నానని .. మీరు మాత్రం ఎదురు దాడి చెయ్యకండని .. ఆలా చేస్తే ‘పాకిస్తానుకు మొత్తం తీరిపోతుంది’ అని సెలవిచారట.. ఇక రష్యా అయితే ‘భారత్ వెంటే ఉంటాం’ అని బాహాటంగానే ప్రకటించింది. దీనితో చైనా పునరాలోచిస్తుంది. ముస్లీమ్ దేశాలతో పాటు మొత్తం ప్రపంచం పాకిస్తాన్ పాపిష్టి పనులను ఛీ కొట్టింది.గత అర్ధరాత్రి ఒంటిగంటా 28 నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది ఇక పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. ఎంత మంది చనిపోయారో? అధికారికంగా తెలియలేదు. అయితే పాక్ ఆర్మీ కాశ్మిర్ సరిహద్దులలో జరిపిన కాల్పులలో ముగ్గురు అమాయక భారతీయ పౌరులు మరణించారు. భారతదేశం చేసిన ఈ క్షిపణీ దాడిలో కీలక ఉగ్రవాద లీడర్లు హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా?, లేదా తప్పించుకున్నారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. నేటి ఉదయం 11 గంటలకు భారత ప్రభుత్వం ఈ దాడులపై మీడియా ముందు అధికారికంగా స్వాదిస్తుంది. భారత దాడి తర్వాత, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఈ దాడిని ధృవీకరించారు. భారతదేశం మనపై యుద్ధానికి కాలు దువ్విందని దీటుగా బదులిస్తామని ప్రకటించారు.
