సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ పాకిస్తాన్ ఉగ్రదాడులను ఇక సహించం .. అటు నుండి బుల్లెట్ వస్తే ఇటునుండి మిసైల్ వెళుతుంది అంటూ తీవ్ర హెచ్చరిక లు చేస్తూ దేశప్రజలు ఉద్దేశించి గత సోమవారం ప్రసంగించిన తదుపరి పాకిస్తాన్ మరో సారి డ్రోన్స్ తో భారత్ సరిహద్దు పట్టణాల ఫై దాడి కి ప్రయత్నించడం వారి నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ రెండోసారి ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నప్పటికీ ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున నేపథ్యంలో సైన్యం సమన్వయము వహిస్తుంది. అది కాకా భారత్ 3 రోజులు క్రితం పాకిస్తాన్ ఫై జరిపిన బీకర దాడిలో బ్రహ్మోస్ క్షిపణీలు ప్రయోగించిన నేపథ్యంలో కీలకమైన సైనిక స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడులు చేసింది. 8 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసింది. భారత్‌ దాడుల్లో సర్గోడాలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు శాటిలైట్‌ ఫొటోల్లో తెలుస్తోంది. కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్‌ వే అనుసంధానంగా ఉన్నట్లు తెలుస్తున్నది.పాకిస్తాన్ లో కిరానా కొండలు లో రంధ్రాలు పడి వాటి క్రింద దాచిన అణుబాంబులు లోపలే పేలుతున్నాయని, అణు రేడియేషన్ బయటకు వస్తున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందుకే పాకిస్తాన్ లో రిచర్డ్ స్కేల్ ఫై 4-6 వరకు గత 3 రోజులుగా భూ కంపాలు వస్తున్నాయని వార్తలు భగ్గుమన్నాయి. అయితే కిరానా కొండలపై దాడులు చెయ్యలేదని భారత్ వాయు సేన ఆ వార్తలను ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *