సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికి భారత్ ఫై తన అక్కసు కొనసాగిస్తూనే ఉన్నారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మరో ప్రక్క డాలర్‌తో పోల్చుకుంటే భారత్ రూపాయి రోజు రోజుకూ దారుణంగా క్షీణిస్తుండడం, కూడా ఈవారంలో రోజురోజుకు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల జోరు కొనసాగిస్తున్నాయి. గత సోమవారం సెషన్ ముగింపు (85, 102)తో పోల్చుకుంటే నేడు, మంగళవారం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 560 పాయింట్ల నష్టంతో 84, 542 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 176 పాయింట్ల నష్టంతో 25, 784 వద్ద కొనసాగుతోంది. (stock market ) బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 473 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.01గా ఉంది.
