సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ దూకుడు సుంకాలు, ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్, రష్యా, చైనాలతో అమెరికా సంబంధాల్లో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేడు, శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాలు చైనాకు లొంగిపోయాయని తన ‘ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫాం’ లో వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజన్‌లో ఇటీవల ఎస్‌సీఓ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలసి హుషారుగా పాల్గొనడం, ఆసియా లోనే కాదు ప్రపంచంలో సగం జనాభా మార్కెట్ ఉన్న3 అగ్రదేశాలు తలచుకొంటే ఎలా ఉంటుందో అమెరికా తో సహా ప్రరోక్షంగా యూరప్ దేశాల కూటమి నాటో కు సంకేతం పంపడంతో రగిలిపోయిన ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘భారత్, రష్యాలు చైనాకు లొంగిపోయినట్టు కనిపిస్తోంది. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్రంప్ తన పోస్ట్‌లో అన్నారు. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ పక్కపక్కనే నడుస్తున్న తాజా ఫోటోను కూడా ఆయన తన పోస్టుకు జత చేసి చూపించడం గమనార్హం. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ.. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని చైనా లో ఎస్‌సీఓ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలులో ఉన్న భారత్ హాజరు అయ్యింది అని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తేల్చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *