సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధాల సంక్షోభంలో భారత్ లో ఇప్పటికే వంటగ్యాస్ సిలెండర్లు రేట్లు భారీగా పెరిగిపోయాయి. రష్యా మినహా ఇతర దేశాలనుండి భారత్ కు రావలసిన క్రూడ్ ఆయిల్ ఓడలను సముద్రంలో ఇరాన్ అడ్డగిస్తుంది. లేదా దాడులతో తగలెత్తేస్తుంది.మరల కష్టాలలో ఉన్న భారత్ కు మిత్రుడు రష్యా క్రూడ్ ఆయిల్ సరఫరా కు ముందుకు వచ్చింది. అమెరికా అనుమతి ఇచ్చింది. దీనిపై నేడు, ఆదివారం తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. ‘యుద్ధం వల్ల పశ్చిమాసియాలో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నామని ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడం కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు అనుమతి ఇచ్చాం. దీని వల్ల రష్యాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనమూ లభించదు. ఎందుకంటే సముద్రంలో ఇప్పటికే ఉన్న రష్యా ముడి చమురును కొనేందుకే భారత్‌కు మినహాయింపు ఇచ్చాం’ అని ట్రంప్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *