సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ రానున్న బైడెన్ నాలుగు రోజులపాటు ఇక్కడే ఉంటారు. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన సాగనుంది. ఈ 4 రోజుల పర్యటనలో ఢిల్లీ వేదికగా జరిగే జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అధికారికంగా ప్రకటించారు. వైట్ హౌజ్ ప్రకటనం ప్రకటించిన వివరాల ప్రకారం.. జీ 20 సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కారణంగా ఉక్రెయిన్‌లో తలెత్తిన యుద్ధం, దాని వల్ల సంభవించిన ఆర్థిక, సామాజిక పరిణామాలు, వాతావరణ మార్పులతో పోరాటం, శుధ్ధ ఇంధనానికి మారడం, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి ప్రంపంచలోని అనేక సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను బైడెన్ చర్చించనున్నారు. ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా పేదరికంపై మెరుగ్గా పోరాడేందుకు ఈ సమావేశంలో దేశాధినేతలతో కలిసి బైడెన్ సమాలోచనలు జరపనున్నారు. కూటమికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వహిస్తున్న సారథ్యం, భారత్ – అమెరికా మధ్య స్నేహం మరింత బలోపేతం గురించి ఆయన ప్రస్తావించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *