సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం అమెరికా దేశంలో భారతీయుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. చాల మంది దేశం నుండి ఎప్పుడు వెళ్ళగొడతారో? అని, ఉడ్జ్యోగాలు పోగొట్టుకొంటామని.. అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నేడు, సోమవారం ప్రధాని మోడీ తో చర్చించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ , ఆయన భార్య ఉషా ( భారతీయ సంతతి)దంపతులు భారత్ చేరుకొన్నారు. పాలం ఎయిర్‌పోర్టులో జేడీవాన్స్‌కు స్వాగతం పలికారు భారతీయ అధికారులు. నేడు ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాలు ను జేడీవాన్స్ దంపతులు సందర్శిస్తారు. సాయంత్రం 6:30కి ప్రధాని మోదీతో జేడీవాన్స్ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశంలో భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో చర్చ జరగనుంది. దీనిపై ఇరుదేశాల వ్యాపార వర్గాలు ప్రవాస భారతీయ కుటుంబాలకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
