సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 40 కోట్ల మార్క్ కు చేరుకొంటుంటే.. ఒక్క అమెరికాలో ప్రతి రోజు 10 లక్షల నుండి 15 లక్షల వరకు కేసులు నమోదు ఆందోళన రేకెత్తిస్తుంది. ఇక మన భారత దేశంలో గత 14 రోజులుగా రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో తాజాగా నేటి ఆదివారం ప్రకటన ప్రకారం గత 24 గంటలలో 2,71,202 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటిలో ఎక్కువ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ లలోనే ఉండటం విశేషం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు. గత శనివారంతో(జనవరి 15) పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివ్ రేటు 16.28%గా ఉంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7,743గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది.
