సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత్‌లో గత 24 గంటలలో 8 నెలల తర్వాత రోజువారీ కేసులు 3 లక్షలు పైగా కరోనా వైరస్‌ కేసులు,491 మంది మరణించడంతో ఇక ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి. కేసులలో సింహభాగం, మహారాష్ట్ర, ఢిల్లీ, లతో పాటు ఒక్క రోజులో 40 వేల పైగా కేసులతో కర్ణాటక కూడా ఉండటం విశేషము అయితే వాక్సిన్ కారణం గానో, వైరస్ తీవ్రత గత స్థాయిలో లేకపోవడం, లేదా ప్రజలలో ఇమ్యూనిటీ పవర్ పెరగటం చేతనో .. మరణాలు సంఖ్యా మాత్రం చాల తక్కువ శాతం మాత్రమే ఉండటం పెద్ద ఊరట.. ఏది ఏమైనా దేశంలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. దేశంలో తాజాగా కొత్త కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటేశాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,35,180 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 3,17,532 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 16.41 శాతానికి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 9,287కు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *