సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా పరిణామాలు భారత్ లో జరుగుతున్నాయి. నేడు, శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపతి ముర్ము తో సమావేశం అయ్యారు. అక్కడ భారత పుతిన్‌కు అధికారిక స్వాగతం , సైనిక వందనం లభించాయి. నేడు, శుక్రవారం ఇరు దేశాల మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో.. వాణిజ్యం, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగం వంటి 25 కీలక ఒప్పందాలు కుదరనున్నాయి భారత 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం భారత్ కు వచ్చిన, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ ప్రక్కన పెట్టి స్వయంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి, తన కారులో లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో రాత్రి విందుకు తీసుకొని వెళ్ళారు. ఆయనకు రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను అపూర్వ బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు మోదీ. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గీత ఒక ప్రేరణాత్మక గ్రంథమని ప్రధాని అభివర్ణించారు. భారత్-రష్యాల మైత్రి ఎన్నో కాల పరీక్షలను ఎదుర్కొని దేశ ప్రజలకు గొప్ప ప్రయోజనం చేకూర్చింది’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *