సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. భారత్ – పాక్ విభజనకు సంబంధించి బాధతో ఓ బాలుడు పాడిన పాట ఈ వీడియోలో ఉంది. ఇటీవల సనాతన హిందూ ధర్మం అంటూ ఎలుగెత్తిన పవన్ తన ట్వీట్ లో పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది అన్నారు. ‘భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు’ దీపావళి శుభాకాంక్షలు. ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. మీ భద్రత, స్థిరత్వం కోసం భారత్ లోని ప్రతిఒక్కరం ఎరుచూస్తున్నాం. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో అణచివేతకు గురవుతున్న హిందువుల భద్రత, వారికి ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్ ప్రపంచం, ప్రపంచ నేతలు కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నా.. వారికోసం మనమంతా ప్రార్ధిద్దాం అని పవన్ పేర్కొన్నారు. అయితే, పవన్ కల్యాణ్ ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
