సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ నేడు, హైదరాబాద్ లో మీడియా ముందు తెలుగులో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక ఎకానమీ 5 ట్రిలియన్‌పై జోకులు వేయవద్దంటూ రెండు చేతులు జోడించి వ్యంగ్యంగా సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. తెలంగాణకు 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. తమపై విమర్శలు చేస్తున్నారని, మరి మీ సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. కాగా ఇటీవల 2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌గా శాసనసభలో సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్‌ అని, మోదీ బడాయిలు పోతున్నారని, వైఫల్యాలను హుందాగా ఒప్పుకోవాలని సీఎం అన్నారు. ప్రపంచంలో 192 దేశాలుంటే అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమని, మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌ ముందున్నాయని చూపుతూ విమర్శించారు. ప్రధాని మోడీ ఫై కధనం ఇచ్చిన బీబీసీ ని ఇబ్బంది పెడుతున్నారని, 2024లో బీజేపీ కుప్పకూలడం ఖాయమని సీఎం జోస్యం చెప్పారు. దేశంలో అంతులేని ప్రైవేటీకరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలు, ఎయిర్‌పోర్టులతో పాటు చివరికి భారతదేశ ఆత్మలాంటి ఎల్‌ఐసీని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *