సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో గత శనివారం సాయంత్రం భారత సైన్యానికి మనమంతా సంఘటితంగా మద్దతు ప్రకటిద్దామంటూ భీమవరంలో పాదయాత్రగా ప్రజానీకం భారీ ర్యాలీ నిర్వహించారు. భీమవరం అడ్డ వంతెన మూర్తి రాజు విగ్రహం నుండి నుండి టాటా విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీకి భారత్ జవాన్ డ్రెస్ లో ఇటీవల వీరమరణం పొందిన తెలుగు వాడైనా జవాన్ మురళి నాయక్ ఫోటో ను చేతబూని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. , ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా అధికారులు, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారత్ మాత కి జై అంటూ నినాదాలతో పట్టణ వీధుల గుండా మువ్వన్నెల జెండాలు చేతబూని ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.
