సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో పంజాబ్ నుండి విడివడి ఖలిస్థాన్ దేశంగా ఏర్పాటు చేసుకొంటామని కొందరు చేస్తున్న వేర్పాటు ఉద్యమానికి అటు పాకిస్తాన్ తో పాటు కెనడా కూడా వేర్పాటు వాదులకు వేదికగా పరోక్షంగా మద్దతూ పలుకుతుందని అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో ఇటీవల ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించిన కెనడా లోని ట్రూడో ప్రభుత్వం ఆదేశం లోని మన రాయబారి కెనడాలోని భారత రాయబారి కెనడియన్ పై ఆ దేశంలోని ట్రూడో సర్కారు వేటు వేసిన నేపథ్యంలో ఇండియా విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా భారత్ తరపున అదే తీరున రిటర్న్ గిప్ట్ ఇచ్చారు. భారత్ లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్త కామెరూన్ మెక్కే ను దేశం నుంచి బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్య వేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ‘‘మన భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్య వేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆ రాయబారిని బహిష్కరించాం ’’ అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
