సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో ట్రంప్ సుంకాల దెబ్బకు వరుసగా మూడు రోజులుగా భారీ నష్టాలకు దిగజారిపోతున్న స్టాక్స్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తాజగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 8న) భారత స్టాక్ మార్కెట్లు (Stock market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో ట్రేడైంది. అదే సమయంలో నిఫ్టీ కూడా 400 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 800 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కూడా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ క్రమంలో మార్కెట్లో మరల కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. నిఫ్టీలోని యాభై స్టాక్స్ అన్నీ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమై దూసుకెళ్తున్నాయి. దీంతో అనేక మంది మదుపర్లు లాభపడుతున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.
