సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెల రోజులుగా, ఎదో బెలూన్ కు గాలి కొట్టినట్లు పెరిగిపోతున్న బంగారం వెండి ధరలు( gold, silver) ఒక్క సారిగా నేడు శుక్రవారం భారీ స్థాయిలో తగ్గిపోయాయి. నేడు (జనవరి 30 ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే భారీ స్థాయిలో తగ్గాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.8 వేల మేర, వెండి ధర రూ.15 వేల మేర తగ్గిపోయింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధర ఒక్కసారిగా ధరలు పడిపోతున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో విజయవాడ ,హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.8,230 మేర తగ్గి రూ.1,70,620కు చేరింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.7550 మేర తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.4,15,000గా ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే ఇది రూ.10 వేలు తగ్గింది.
