సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా దీపావళి పండుగల సీజన్‌లో బంగారం(gold), వెండి (silver) ధరలు భారీ గా పెరిగాయి. కానీ ఇటీవల అంతే వేగంగా ధరలు తగ్గుతున్నాయి. గత రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3000 తగ్గగా, వెండి ధర కిలోకు రూ. 5 వేలు తగ్గింది. గతంలో సాధారణ బడ్జెట్ సమయంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత ఇంత భారీ తగ్గుదల కనిపించింది. తాజాగా మళ్లీ పసిడి రేట్లు తగ్గుముఖం పట్టాయి. నేడు గురువారం దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 290 తగ్గి రూ.76,990కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70,590కి చేరింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,840కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,440కి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు వెయ్యి రూపాయలకుపైగా పడిపోయాయి.
