సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సామాన్యుడి ఇంట నిత్యా అవసరం ఉల్లి.. అయితే గత ఏడాదిగా నాణ్యమైన ఉల్లి 20 రూపాయలు నుండి ఒక్కసారిగా 70 రూపాయల వద్ద 6 నెలలు తిష్టవేసి కాస్త కాస్తగా దిగివచ్చి 40 రూపాయలు వద్ద నిలబడిన ఉల్లి సామాన్యులకు అదే రేటుకు అలవాటు పడింది. ఇంతలో ఏమియిందో ఒక్కసారిగా గత వారం 30 రూప్యాలుకు పడిపోయింది. తాజగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉల్లిపాయలకు పెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన తాడేపల్లి గూడెం నుండి అందిన సమాచారం ప్రకారంఉల్లి ధర మరింత పడిపోయి హోల్ సెల్ మార్కెట్ లో ఎ గ్రేడు రకం రూ.12 పలుకు తోంది. భీమవరం రిటైల్ మార్కెట్ లో సైతం 15-20 రూపాయలకు ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి దిగుబడి బాగా పెరిగి పశ్చిమ గోదావరి జిల్లాకు ఉల్లి జోరుగా దిగుమతి అవుతోంది. ఈసారి ఉల్లి ధర వర్షాకాలం వచ్చేవరకూ .ఇదే రీతిని కొనసాగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. చూద్దాం..
