సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. కొత్త ఏడాది వస్తుంటే దానితో పాటు భారీ ధరల పెరుగుదలతో ఈ ఏడాది వీడ్కోలు పలుకుతుంది. మొన్న దసరా దీపావళి పండుగలకు ముందు మరి జీఎస్టీలో సంస్కరణలతో జనం పండగ చేసుకోవాలంటూ ‘జీఎస్టీ 2.O ఇక టాక్స్ తగ్గించాం .. ధరలు తగ్గిపోతాయి’ అని తెగ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వాము ..తీరా, కిస్మస్, సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఈ రేట్ల భారీ పెరుగుదలపై ఎందుకు గప్‌చుప్‌గా ఉంటుందో తెలియదు.. ప్రతి దానికి డాలర్ రేటు పెరిగిపోయింది. రూపాయి విలువ 90 రూపాయల ఫైచిలుకు పడిపోయింది అనే సాకు. నిజంగా అన్ని నిత్యావసరలు విదేశాల నుండే దిగుమతి చేసుకొంటారా? ఆ సాకుతో వంటనూనె మొదలు కోడిగుడ్డు ధరలు వరకు ధరలు పెరిగిపోతున్నాయి. మలేషియా, రష్యా సహా కొన్ని దేశాల నుంచి మనకి సన్ ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం.మరి డాలర్ మారకపు విలువ 86 రూపాయల నుండి91 రూపాయలకు మధ్య పెరిగింది 5 రూపాయలైతే.. వంట నూనె లీటర్‌కి 20 -30రూపాయలు తేడా వస్తుందా..? ఇప్పుడు వంట నూనె లీటర్ 145 నుండి 170 రూపాయలకు ఎగబాకింది. ఇక కందిపప్పు రేటు రూ.105 నుంచి రూ.140 పలుకుతోంది. మినపప్పు రేటు కూడా రూ.110 నుంచి 170 పలుకుతోంది.కూరగాయల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మరల క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. బియ్యం కూడా 26 కేజీల బస్తా కనీసం 1200 నుంచి రూ.1700 ఇంకా పైన రేటు పలుకుతోంది.. 30 కోడిగ్రుడ్లు హోల్ సేల్ ధర 220 కి ఎగబాకుతుంది. రిటైల్ గా గుడ్డు ఒక్కటి 10 రూపాయలు అమ్మడం ఎప్పుడైనా చూశామా ? బ్రాండ్ పేరు చెప్పుకుని ఈ నిత్యావసరాల రేట్లు ఎంతకైనా అమ్మే సమర్ధులు ఉన్నారు. వ్యాపార సంస్థలపై దీనిపై ప్రభుత్వ నిఘా సంస్థలు, జీఎస్టీ అధికారులు సుమోటా గా కేసులు పెట్టి దర్యాప్తు చెయ్యాలి.
