సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం ఉదయం భారీ లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు విచిత్రంగా మధ్యాహ్నం యూటర్న్ తీసుకున్నాయి. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.(Indian stock )గత మంగళవారం సెషన్ ముగింపు (82,225)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 220 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగిసింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడి 82,957 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం అమ్మకాలు మొదలు కావడంతో కిందకు దిగి వచ్చింది. చివరకు 50 పాయింట్ల లాభంతో 82,276 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 57 పాయింట్ల లాభంతో 25,482 వద్ద స్థిరపడింది (stock market ).సెన్సెక్స్, నిఫ్టీలో మ్యాన్‌కైండ్ ఫార్మా, నాల్కో, వేదాంత, లారస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market ) బ్యాంక్ నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 339 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.95గా నిలబడింది.
