సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఛతీస్ ఘడ్ లో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ (Maoist Party)కి కోలుకోలేని ఎదురుదెబ్బ లు ఎక్కువయ్యాయి. తాజాగా నేడు, ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కు లో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.గత నెలరోజులలో సుమారు 100 మంది మావోయిస్టు లు ఎన్కౌంటర్స్ లో మరణించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా కొద్దీ రోజుల క్రితం ఈ నెల 6న ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *