సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పిలుపు మేరకు పెద్ద ఎత్తున మావోలు లొంగిపోతుండటంతో వారి నేతల రహస్యాలు , డంప్ లు కూడా భారత్ జవాన్ లకు పోలీసులకు తెలసిపోతుండటం తో ఇటీవల వరుసగా భారీ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. ఎందరో మావోలు తమ సిద్ధాంతం కోసం ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. తాజగా నేడు, శనివారం ఛత్తీస్‌గఢ్ లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 28మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవి ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు.అయితే దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం. హోరాహోరీ ఎన్కౌంటర్ జరుగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
