సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఈ మాఘ మాసం శుభకార్యక్రమాల సీజన్.. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్ప ల్పం గా తగ్గిన పసిడి ధరలు నేడు, మంగళవారం భారీగా తగ్గాయి. ఇటీవల వారం రోజులుగా బంగారం ధరలు 10గ్రాములకు రూ.1000 పైగా తగ్గాయి. తాజగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెద్ద ముహర్తం.. పైగా ప్రేమికుల దినోత్సవం రోజు (ఫిబ్రవరి 14). 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యా రెట్ల బంగారం 10 గ్రాముల ధరరూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద స్థిరంగా ఉంది. శుభకార్యాల కోసం విశేషంగా పసిడి కొనుగోలుచేసేవారికి దీనితో కొంత లబ్ది చేకూరుతుంది.
