సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం, ఇప్పటికే వెలువడిన త్రైమాసిక ఫలితాలు కూడా మెప్పించకపోవడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 444 పాయింట్లు కుంగి 80,561 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 24,625 వద్ద కొనసాగుతోంది. ఓ దశలో 600 పాయింట్లు నష్టపోయి 80, 409 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:-20 గంటలకు 330 పాయింట్ల నష్టంతో 80, 676 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. డాలర్ తో మన దేశ రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఇన్ఫోసిస్, నెన్లే ఇండియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్.. ఈ నాలుగు షేర్లు మాత్రమే సెన్సెక్స్ 30 సూచీలో లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *