సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొన్ని రోజులుగా మదుపర్లను నష్టాలతో ఆందోళనకు గురిచేస్తున్నభారతీయ స్టాక్ మార్కెట్ ఫై బేర్ పట్టు కొనసాగుతుంది. నేడు, శుక్రవారం వారాంతంలో కూడా సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్లు మేర నష్టపోగా.. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 24,200 దిగువకు వచ్చింది. బలహీన త్రైమాసిక ఫలితాలు, ఎఫ్ఐఐల అమ్మకాల కారణంగా సూచీలు గత రెండున్నర నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి సుమారు రూ.437 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79,137.98 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 662 పాయిం ట్ల నష్టం తో 79,402 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.60 పాయింట్ల నష్టంతో 24,180.80 వద్ద స్థిర పడింది. డాలరుతో మన
రూపాయి మారకం విలువ 84.09 దగ్గర నిలబడింది.
