సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్. ఇజ్రాయిల్,తో ఇరాన్, లెబనాన్ దేశాల యుద్ధ బేరితో ప్రపంచ స్టాక్ మార్కెట్ తో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, గురువారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్‌ల కొత్త రూల్స్ సహా పలు అంశాల నేపథ్యంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,804 పాయింట్ల నష్టంతో 82,461 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 552 పాయింట్లు పతనమై 50,556 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 1205 పాయింట్లు కోల్పోయి 51708 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1402 పాయింట్లు తగ్గి 58938 స్థాయిలో ఉంది. ఈ క్రమంలో మదుపర్లు కొన్ని గంటల్లోనే దాదాపు 11 లక్షల కోట్లు నష్టపోయారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం BPCL, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, లార్సెన్ టాప్ 5 నష్టాల స్టాక్స్‌లో ఉండగా, BSE సెన్సెక్స్‌లో కేవలం రెండు స్టాక్‌లు మాత్రమే లాభపడ్డాయి JSW స్టీల్ (1.66 శాతం పెరిగింది). టాటా స్టీల్ మినహా అన్ని ఇతర స్టాక్‌లు క్షీణించాయి.
