సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం గా .. జగన్ సర్కార్ అనుసరిస్తున్న 3 రాజధానులు కు మద్దతుగా అందులోను విశాఖ పరిపాలన రాజధాని కావాలని డిమాండ్ చేస్తూ నేడు, శనివారం ఉత్తరాంద్ర ప్రజలు తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు విశాఖ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగాతరలివచ్చారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ.. ఉదయం 11 గంటలకే భారీ వర్షం పడుతున్న ఉత్తరాంద్ర లోని అన్ని జిల్లాల నుండి , లాయర్లు, ప్రొఫిసర్స్, ,రాజకీయ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, మహిళలు,వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉత్తరాంద్ర ప్రజలు చేరుకొని విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టి నినాదాలతో అన్ని రోడ్డులు హోరెత్తిస్తున్నారు. నిజానికి ఒక లక్ష మంది తో ర్యాలీ అని చెప్పినప్పటికి అన్ని ప్రాంతలాల్ నుండి వేలాదిగా తరలి వస్తున్నా జనం చూస్తుంటే వారి సంఖ్యా ఎన్ని లక్షలు చేరుతుందో సాయంత్రం కు తెలుస్తుంది. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి… ,ప్రపం చం లోని అద్భు త నగరాల్లోవిశాఖ ఒకటి.. ఉత్తరాం ధ్ర ప్రజల కష్టాలు ఇంకెన్నా ళ్లు.. 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటూ.. అచ్చె న్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి ..అమరావతి రియాల్ ఎస్టేటు వ్యాపారులను తరిమికొట్టండి..అంటూ జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేస్తున్నారు. మంత్రులు అమర్నాధ్, కోడలి నాని, రోజా తదితరులు ర్యాలీలో పాల్గొంటున్నారు.
