సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలామల శెట్టి సునీల్ కు కూటమిలో జనసేన అభ్యర్థిగా తంగేల ఉదయ్ శ్రీనివాస్ ల మధ్య కాకినాడ లోక్ సభ ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని అందరూ భావిస్తున్న, నేపథ్యంలో ఎవరు ఊహించని విధంగా తాజగా జనసేన లోక్ సభ అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాస్ భారీ వివాదంలో ఇరుక్కొన్నారు. తన ఎన్నికల అఫిడవిట్ తన విద్యా అర్హత ఇంటర్ గా పేర్కనడంతో అసలు వివాదం రాజుకొంది. ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది?అందులో దుబాయ్ లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధ్యమా? అన్న లోతైన కోణంలో రాజకీయ ప్రత్యర్థులు చేసిన దర్యాప్తు లో తేలిన వాస్తవాలు అంటూ.. నిజానికి దుబాయ్ లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ జాబ్ చేయలేదని, క్రికెట్ బుకీ నిర్వహించేవాడని పేర్కొంటున్నారు. అక్క డి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన తంగెల ఉదయ్ శ్రీనివాస్ పై దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చి లో కేసు నమోదు చేసి, అతని కోసం లుక్ ఔట్ నోటీసు ఇచ్చారన్న దానికి సంబంధించి కేసు వివరాల ఆధారాల పత్రాలను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడం తో వాటినుంచి తప్పిం చుకొని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తానో సాఫ్ట్ వేర్ ఇంజనీర్అని చెప్పుకొని దుబాయ్ లోనే తాను కోట్లు సంపాధించానని బిల్డప్ ఇస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఉదయ్ శ్రీనివాస్ పైన మన దేశంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పాన్ కార్డులు తీసుకొని వివిధ కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణ కూడా ఉంది. భూ కబ్జా కేసు కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి అంటూ ఆరోపిస్తూ ఆయన రాజకీయ ప్రత్య ర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరో ఈ పిర్యాదులు విమర్శలు ఫై ఉదయ్ శ్రీను వాసు ఇంకా అధికారికముగా ప్రకటన ఇవ్వలేదు.. ఈ ఫిర్యాదుల వివాదాల నేపథ్యంలో కాకినాడ ఫలితం ఫై ఏ మేర ప్రభావితం చూపుతోందో ? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *