సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యిన భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)కి నేడు, బుధవారం మధ్యంతర బెయిల్ లభించింది. 12 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్కార్ట్ వాహనంలోనే భాస్కర్ రెడ్డిని తరలించాలని ఆదేశించింది. 15 రోజులు పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టును కోరారు. తన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 12 రోజుల పాటు పోలీస్ బందోబస్తుతోనే సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
