సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మండు వేసవిలో గత 3 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి ఈ సారి ఇబ్బడి ముబ్బడిగా పండిన వరి పంట కోతలుకు రావడంతో వాతావరణం బాగోకపోవడంతో భీమవరం ,ఉండి పరిసర డెల్టా ప్రాంతాలలో రైతులు మాసూళ్ళుకు ముందుకు రాలేకపోయారు, వ్యవసాయశాఖ అధికారులు కూడా మరో రెండు రోజులు పాటు పంట మాసూళ్ళు వాయిదా వేసుకోవాలని సూచించడంతో రైతులు కొత్తగా కోతలు కోయడం ప్రారంభంచ లేదు. అయితే నేటి మంగళవారం నుండి నిప్పులు చెరుగుతూ ఉదయం 9 గంటల నుండే భానుడు చెలరేగిపోవడంతో రైతులలో ఆనందం వెల్లివిరిసింది. మాసూళ్లు మొదలెటేసారు.
