సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ప్రజలకు సరసమైన ధరలకు నాణ్య మైన బియ్యాన్ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొందని ప్రజలు ఈ అవకాశాన్ని గునుపూడి లో ఉన్న రైతు బజారు లో తాను బియ్యం స్టాల్స్ ను ప్రారంభించానని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఇటీవల గత 2 నెలలుగా రిటైల్ మార్కె ట్లో అధికంగా ఉన్న బియ్యం ధరలను నియంత్రించేందుకు సివిల్ సప్లయ్ అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ , బియ్యం వ్యాపారుల సమన్వయంతో భీమవరంలో తొలిస్టోర్ ప్రారంభించామన్నారు. కిలో సాధారణ రకం రూ.34, ఫైన్ రకం రూ.40, సూపర్ ఫైన్ రకం రూ.46కు విక్రయిస్తారన్నారు. ఇక్కడ టమాలు ,కందిపప్పు కూడా తక్కువ ధరకు విక్రయిస్తారన్నారు. నేడు, శనివారం తణుకు, తాడేపల్లిగూడెం,ఆకివీడులో బియ్యం స్టోర్లను ప్రారంభించామని తెలిపారు. . జిల్లాలో మరో పది మండలాల్లో స్టోర్ల ఏర్పాటుకు నిర్ణయించామన్నా రు.
