సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 5 ప్రధాన కేంద్రాలలో ఫిష్ ఆంధ్రా రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు భీమవరంలోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారుల సమావేశంలో ప్రకటించారు. ఆమె మాట్లాడుతూ.. చేపల పెంపకం దారులకు ప్రభుత్వ ప్రోత్సహంగా జిల్లాలో ఫిష్ ఆంధ్రా విక్రయ కేంద్రాల ఏర్పాటుకు రుణాలు త్వరగా మంజూరు చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని భీమవరం, నరసాపురం, పెంటపాడులలో ఒక్కొక్కటి, పాలకొల్లులో రెండు చొప్పున ఫిష్ ఆంధ్రా రెస్టారెంట్లు ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. లైవ్ ఫిష్ యూనిట్లు భీమవరంలో రెండు, తణుకు, మార్టేరు, మొగల్తూరు, నరసాపురంలో ఒక్కొక్క టి చొప్పున ఏర్పాటు చేస్తామన్నా రు. డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్, ఇన్ఛార్జి జిల్లా మత్స్య శాఖాధికారి రాజ్ కుమార్, ఏడీ ఆనందరావు, డీసీసీబీ సీఈవో శ్రీదేవి,డీపీఎం కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
