సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పర్వదినాలు తెలంగాణ లోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలనుండి పశ్చిమ గోదావరి జిల్లా కు వచ్చిన వారు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి రేపటి గురువారం నుండి రద్దీ దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల నుంచి హైదరాబాద్‌కు ఈనెల 6నుంచి 9 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు ఎప్పటిలానే రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా ప్రతీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయడం లేదన్నారు. నర్సాపురం డిపో నుంచి 12 బస్సులు, తణుకు, భీమవరం డిపోల నుంచి 10 బస్సులు, తాడేపల్లిగూడెం డిపో నుంచి 8 బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
