సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పట్టణంలో11, 12వ వార్డులలో‌ 66 లక్షల నిధులతో చేపట్టే సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు‌ నేడు, శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..గత నాలుగున్నరేళ్ళ కాలంలో భీమవరం పట్టణం లో ఒక కార్పొరేట్ సిటీని తలపించేలా జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ప్రతి వార్డులో కూడా ప్రజల కోరిక, సూచనల మేరకు అభివృద్ధి పనులు జరిగాయని ఆయన ప్రకటించారు. పట్టణంలో ఎక్కడ చుసిన కోట్లాది రూపాయల వ్యయంతో గతంలో కనివిని ఎరుగని రీతిలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్లతో, కొత్త డ్రైన్స్ తో,వంతెనలుతో కళకళ లాడుతుందని . భీమవరం పట్టణాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా పెరిగే జనాభాకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అందిస్తున్న కోటి లీటర్ల మంచినీటి కెపాసిటీని 2కోట్లకు పైగా పెంచుతున్నామని అన్నారు. అమృత పథకంలో పట్టణంలో ఇప్పటికే మూడు రిజర్వాయర్లను నిర్మించుకోవడం జరిగిందని త్వరలోనే వాటిని ప్రజా వినియోగంలోకి తీసుకొనివస్తున్నామని, మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ప్రజలు ఇప్పటికే గుర్తించారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *