సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి అన్నివర్గాల వారూ జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని భీమవరం నియోజకవర్గం జనసేన, టిడిపి, బిజెపిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు సుమారు 60 మంది జనసేన పార్టీ లోకి ఆహ్వానిస్తూ వారికీ పార్టీ లు కండువాలు కప్పారు. అంజిబాబు జనంకోసం పనిచేసే నేత అని జనసేన పార్టీలో చేరేందుకు తామంతా పార్టీలో చేరామని అంజిబాబు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ యువశక్తి కలిగిన పార్టీ అన్నారు. ఆటోడ్రైవర్ లు అందరికీ ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని, ప్రతీ ఆటో డ్రైవర్ కి సొంత ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి బండి రమేష్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకర రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ కౌన్సిలర్లు వానపల్లి సూరిబాబు, మాగాపు ప్రసాద్, నాయకులు రామాయణం శ్రీనివాస్ ,త్రివిక్రమ్, రాజేష్, గొర్ల గోపి తదితరులు పాల్గొన్నారు.
