సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు 3వ అధనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి P. శ్రీ సత్యా దేవి నేడు, గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జాతీయ మరియు రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ గురించి గ్రామాలలో ప్రజలకు తెలియజేసే బాధ్యత మీడియా మిత్రులు తీసుకోవాలన్నారు. గతంలో కూడా మీడియా ప్రచారం వల్లనే 848 కేసులను పరిష్కరించగలిగమన్నారు. ప్రజలలో కోర్టుల పట్ల ఉన్న భయాన్ని తీసివేసి గౌరవం కలిగే విధంగా లోక్ అదాలత్ లను వినియోగించుకోవాలన్నారు. చిన్న చిన్న సమస్యలను తక్కువ సమయంలో పరిష్కరించుకోవడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. భీమవరం ఉన్న 5 కోర్టులలో దాదాపు 5496 పెండింగ్ కేసులలో 1202 కేసులను రాజీ చేసే దిశగా గుర్తించినట్లు, లోక్ అదాలత్ పై అవగాహన కల్పించేందకు 4 న్యాయ విజ్ఞాన సదస్సులు, 4సార్లు పోలీస్ అధికారులతో సమావేశాలను, 2 ప్రెస్ మీట్ లను నిర్వహించామన్నారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీ B. అప్పల స్వామి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
