సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే శివరామరాజు అసంతృప్తితో 2వర్గాలుగా చీలిన టీడీపీ పార్టీలో రామరాజు వర్గంలో కూడా అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఉండి నాయకుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు భీమవరంలో ఉండటంతో భీమవరం పట్టణం వేదికగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఉండి సీటు రఘురామకు మార్చడం లాంఛనప్రాయమే అని తాజా సమాచారం రావడంతో.. తాడోపేడో తేలుచుకోవాలని భావించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు టీడీపీ మద్దతుదారులు నేటి గురువారం మధ్యాహ్నం బైకులపై పట్టణవీధుల గుండా నినాదాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులుక్యాడర్ సుమారు 15వందల మంది భీమవరం పట్టణంలోని టీడీపీ జిల్లా అడ్జక్షురాలు, తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు లోపాయకారి నిర్ణయంఫై తీవ్రస్థాయిలో అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. తాజా పరిణామంతో…తోట సీతారామలక్ష్మి, రామరాజు అనుచరులతో మాట్లాడుతూ.. మీ ఆందోళనను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకొనివెళతానని రామరాజు కు అన్నాయం జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. దానితో వారు శాంతించారు.
