సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు భరోసా బస్సుయాత్ర సభ, టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ మంత్రులు, పాలకొల్లు ఉండి ఎమ్మెల్యేలు కు స్వగతం పలుకుతూ..భీమవరం నియోజకవర్గ క్యాడర్ మోటార్ బైక్ ల ర్యాలీ నిర్వహించారు. భీమవరం కు చెందిన టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ళ నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వీరవాసరం సెంటర్‌ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బస్సుయాత్ర ప్రారంభమై నందమూరుగరువు, శృంగవృక్షం, పెన్నాడ, గొరగనమూడి, విస్సాకోడేరు గ్రామాల మీదుగా భీమవరం పట్టణంలోకి చేరుకొంది. నేటి సాయంత్రం జిల్లా పార్టీ అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి ఆధ్వర్యంలో జేపీ రోడ్డులోని భీమవరం ఆనంద ఫంక్షన్‌ హాలులో టీడీపీ సమావేశం ప్రారంభము అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *