సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నేడు, శనివారం , డిసెంబర్ 16వ తేదీన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేతృత్వంలో పశ్చిమగోదావరి జిల్లా కమిటీ లాయర్లు ఆధ్వర్యంలో, భూ యాజమాన్యం హక్కు చట్టoలో ఉన్న లోపాలను తొలగించాలని ఏపీ యాక్ట్ 27/23 రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కి న్యాయవాదులు న్యాయవాదులు మెమొరండాన్ని అందజేశారు. ప్రభుత్వ దృష్టికి ఈ విజ్ఞప్తి తీసుకొనివెళతానని కలెక్టర్ వారికీ హామీ ఇచ్చారు. తదుపరి కార్యాలయం ముందు ఏపీ యాక్ట్ 27/23 ప్రజా వ్యతిరేకమైన దని పేర్కొంటూ దానిని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే డి. రాజగోపాల్, ఆలిండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి తదితరులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *