సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో తుందురు పేరు చెబితే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రోజులు అక్కడ ఆక్వా ప్యాక్టరీ నిర్మాణం దాని ద్వారా వచ్చే కాలుష్యం నివారణకు ఆ గ్రామా ప్రజలు గత చంద్రబాబు పాలన హయాంలో అరెస్టులకు భయపడకుండా వందలాది రోజులు పోలిసుల నిర్బంధంలో అక్కడ ప్రజలు చేసిన పోరాటం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరల సిపిఎం పార్టీ దానిపై పెద్దస్థాయిలో పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు మధు , జిల్లా సిపిఎం సీనియర్ నేత బలరాం తో కలసి నర్సాపురంలో మీరా స్మా రక గ్రంథాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాజగా ప్రకటించారు. తుందుర్రు మెగా ఆక్వా పార్కు ను తొలగించాలని స్థానికులతో కలిసి డిసెంబరు 4 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో తన నేతృత్వంలో మరోసారి ఉద్య మాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. కుటుంబాలు నివాసాల ఉంటున్న ప్రాంతంలో ఏర్పా టు చేసిన మెగా ఆక్వా పార్కు తో ఆ ప్రాంతం మొత్తం కాలుష్య మయం అయ్యిందన్నా రు. గతంలో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ తుందుర్రు వచ్చిన సమయం లో తాను అధికారంలోకి వస్తే ఆక్వా ఫుడ్ పార్కు ను బంగాళాఖాతంలో కలిపివేస్తానన్నారని, ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని ఆరోపించారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు నరసాపురం తీరంలో ఆక్వా యూనివర్సి టీ నిర్మిస్తున్నారని, మరి తుందురు మెగా ఆక్వా పార్కు తొలగించే హామీని కూడా నెరవేర్చి దానినే ఆక్వా వర్సి టీగా మార్చాలని డిమాండ్ చేసారు.
