సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసియున్నపంచారామ శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం (ది.08-11-2022వ తేది) నేడు మంగళ వారం చంద్రగ్రహణం సందర్బముగా ఉదయం గం.10-00లకు మూసి వేసి, తిరిగి (ది.09–11-2022వ తేది) బుధవారం తెల్లవారుఝామున 4-30లకు తెరుస్తామని ఆలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ నేడు ఆలయ ఆవరణలో అర్చకులతో కలసి ప్రకటించారు. ఇక నిన్న కార్తీకమాసం 2వ సోమవారం సందర్బముగా లడ్డు ప్రసాదం విక్రయించుట ద్వారా రూ.41,745/-లు దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.5,76,000/-లు మొత్తం రూ.6,17,745/-లు ఆదాయం వచ్చిందని, నిన్న వచ్చిన వేలాది భక్తులకు తగు ఏర్పాట్లను ధర్మకర్తల మండలి అధ్యక్షలు శ్రీమతి కోడే విజయ లక్షీ మిగతా ధర్మకర్తలు అందరి సహకారంతో ఎవరికి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించినట్లు తెలిపారు.
