సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 24వ వార్డు లోని శ్రీ అభయ సాయి ధ్యాన మందిరం (మినీ షిరిడి ) వారి 31 వ వార్షిక మహోత్సవ ముగింపు సందర్భంగా బాబా వారికి 22 రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తదుపరి బాబా వారికీ అన్నాభిషేకం నిర్వహించారు. శ్రీ బాబావారి పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రప్రథంగా 3 దశాబ్దాల క్రిందట అన్నముతో అభిషేకం ప్రారంభించింది ఇక్కడే కావడం విశేషం…అనంతరం భక్తులకు విశేషంగా అన్న సమారాధన నిర్వహించడం జరిగింది.
