సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో సగం వార్డులు పైగా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఇంటిటా ప్రచారం పూర్తీ అయ్యింది. నేడు, సోమవారం ఉదయం తన స్వంత వార్డు 20వ వార్డు లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వ సేవలను గుర్తించి అఖండ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను అభ్యర్ధించారు. 150 ఏళ్ళ పైగా కొలువై ఉన్న మహిమానిత్వ స్థానిక శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభధ్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు తో పాటు తోట బోగయ్య, స్థానిక మాజీ కౌన్సిలర్ మెంటే బలరాం తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
