సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డి. యన్. ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో NBA అక్రిడేషన్ ను పురస్కరించుకొని అభినందన సభను నేడు, గురువారం (28-03-2024 ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు, గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ.. తమ కళాశాలలో సాంకేతిక విద్యలో పురోగతి మరియు విద్యాభాసం యెక్క నాణ్యత రోజు రోజుకు పెరుగుతుందని దీనిని గుర్తించి గత ఏడాది NAAC A++ వచ్చిందని ఈ ఏడాది ECE, CSE మరియు EEE బ్రాంచులకు NBA అక్రిడేషన్ వచ్చినందున ఈ విజయానికి నిబద్దత తో పనిచేసిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి తన అభినందనలను తెలియజేసారు . కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ.. ఈ అక్రిడేషన్ వలన విద్యార్థులకు వారి భవిష్యత్తులో మెండైన అవకాశాలు లభిస్తాయని విద్యార్థులకు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను, విద్య ప్రమాణాలను, మౌలికవసతులను, ఉద్యోగావకాశాలను, నాణ్యమైన విద్యను అందించటంలో తమ పాలక వర్గం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, డా. యం. అంజన్ కుమార్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. బి. వి. యస్. వర్మ, డీన్స్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక అధ్యాపకకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *