సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌ స్థల మార్పు పై భీమవరం నుండి మరో ప్రాంతానికి తరలిస్తారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ భీమవరంలోని రాజకీపార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, ఆద్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేవం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్‌.వి గోపాలన్‌ అధ్యక్షతన జరిగింది. గోపాలన్‌ మాట్లాడుతూ .. బిజెపిని మినహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి పిలిచామన్నారు. జనసేన,టిడిపిలు తప్ప మిగిలినపార్టీలు ప్రజాసంఘాలన్ని హాజరయ్యారన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి కానీ స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ఇంతటి కీలక విషయం ఫై మోనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. దీనిపై అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యావంతులు, ప్రజానీకాన్నంతటినీ ఏకం చేసి ఆందోళ చేస్తామన్నారు.వైసిపి పార్టీ జిల్లా నేత, భీమవరం మాజీ మునిసిపల్ వైస్ చైర్మెన్ కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కలెక్టరేట్‌ మారుస్తున్నట్లు ఏదైతే వార్తలు వస్తున్నావయో వాటి వెనుకు రాజకీయ జోక్యం కనబడుతోందన్నారు. కలెక్టరేట్‌ అంటే విశాల భవనాలు,దానికితోడు జిల్లా ప్రజానీకం అంటికి అందుబాటలో ఉండే విధంగా మార్కెట్‌ యార్డులో శాస్వతంగా ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాని ప్రభుత్వం మారినపుడల్లా వారి స్వప్రయోజనాలకోంస కలెక్టరేట్‌ని మారుస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయం స్ధానిక ఎం.ఎల్‌.ఎ గార్కి తెలిసి జరుగుతుందా? తెలియకుండా ఆయన ప్రమేయం లేకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఇంత రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడో స్ధలం కేటాయించి ఎందుకు మార్చాలనుకుంటున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌పార్టీ డిసిసి స్రిడిరట్‌ పాతపాటి హరికుమార్‌రాజు , మాజి ఎం.ఎల్‌.ఎ, ఆలిండియా లాయర్స్‌ అసోషియేషన్‌ నాయకులు దిగుపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ ఇది ఒక పిచ్చి తుగ్లక్‌పని అన్నారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న పార్వర్డ్‌బ్లాక్‌ జిల్లా నాయకులు లంకా కృష్ణమూర్తి,, ఎం.సిపిఐయు జిల్లాకార్యదర్శి కొల్లుబత్తుల మహంకాలి,ఐ.ఎన్‌.సి నాయకులు కాకర రాజశేఖర్‌, కొర్ర శ్రీనివాస యాదవ్‌, సిపిఐ టౌన్‌ సెక్రటరీ చెల్లబోయిన రంగారావు, సిపిఎం పార్టీ భీమవరం టౌన్‌ కార్యదర్శి బి.వాసుదేవరావు, దళిత ఐక్యవేదిక గంటా సుందర్‌కుమార్‌, ప్రజాసంఘాల నుండి జక్కంశెట్టి సత్యనారాయణ,తదితర నేతలు దీనిపై అఖిలపక్షం ఆద్వర్యంలో ఐక్య కార్యాచరణ పోరాటానికి కలసి వస్తాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *