సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం సాయంత్రం భీమవరం పట్టణ ప్రధాన సెంటర్ ప్రకాశం చౌక్ లో టీడీపీ యువగళం పాదయాత్ర లో భాగంగా నారా లోకేష్ బహిరంగ సభకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. భీమవరం మీదుగా అన్ని ఇతర ప్రాంతాలకు పట్టణాలకు వెళ్లే వాహనాలు ఈ సెంటర్ పైగానే వెళ్ళాలి కాబ్బటి నేటి సాయంత్రం వాహనాలు దారులు మళ్లిస్తున్నారు. విద్యాసంస్థలు నేడు ఒంటిపూట బడులు నిర్వహించి మధ్యాహ్నం నుండే స్కూల్స్ బస్సులు ఈ సెంటర్ నుండి ముందే దాటిస్తున్నారు. టీడీపీ నిర్వాహకులు ముందు జాగ్రత్తగా జనం రద్దీ ఎక్కువైతే ప్రమాదం జరగకుండా యనమదుర్రు వంతెనల కు ఇరువైపులా ఎత్తు పెంచుతూ బారికెట్స్ కట్టడం బాగుంది. అయితే తమ నేతపై అభిమానంతో ప్రకాశం చౌక్ సెంటర్ తో పాటు పీపీ రోడ్డు వైపు రిలయన్స్ మార్ట్ వరకు ఏకబిగిగా సందులకు తప్ప ఎక్కడ గ్యాప్ లేకుండా భారీ ఫ్లెక్సీ లను కట్టేయడం స్థానిక వ్యాపారస్తులను నివ్వెరపరచింది. భీమవరం పట్టణానికి ప్రధాన వ్యాపార కూడలిలో ఈ రోజు వ్యాపారం దాదాపు బంద్ అయినట్లే.. ఇప్పటివరకు వైసిపి, జనసేన, బీజేపీ వంటి పార్టీలు కూడా రోడ్డు కిరువైపులా స్తంభాలకు చోటా మోటా ఫ్లెక్సీ లు కట్టి వ్యాపారులకు వాహనదారులకు కొంత ఇబ్బంది పెడతారు. అయితే పెద్ద ఫ్లెక్సీ లు మాత్రం వరుసగా ఎవరికీ ఇబ్బంది లేకుండా వ్యాపారులు లేనిచోటల పెడతారు. కానీ ఈ రోజు మంగళవారం మొదటి సారిగా టీడీపీ ఎన్నికల హామీలతో ఉన్న ఫ్లక్సీలు ను దుకాణాలు ఎవరికి కనపడకుండా కర్ర బాధులు వేసి కట్టెయ్యడం పట్ల స్థానిక మునిసిపల్ అధికారులు కూడా ఒక్కరోజే కదా? అని ఊరుకొని ఉండవచ్చు.. కానీ వ్యాపారస్తులను రోజంతా నష్టపరిచే.. ఇది మంచి సంప్రదాయం కాదు.. టీడీపీ తో పాటు మిగతా పార్టీల పెద్దలు కూడా అలోచించి రాజకీయాలు ప్రక్కన పెట్టి ఇక భవిషత్తు లో పోటీలు పడి ఇలాంటి తీరులో ఫ్లెక్సీ లు కట్టకపోవడం మంచిది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *