సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు కొత్త ఏడాది పండుగలు వస్తున్నాయంటే చాలు.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’.. గత దశాబ్ద కాలం పైగా ఎప్పుడు పండుగల సీజన్ లోనైనా రాయల్ క్రాఫ్ట్ బజారు కోసం ప్రజలు ఎదురు చుస్తూఉంటారు. సామాన్యులు ధనవంతులు అన్న తేడా లేకుండా కుటుంబ సమేతంగా వారికి ఇష్టమైన కాటన్ లేటెస్ట్ వస్త్రాలు, చేతి వృత్తి కళాకారుల తయారుచేసిన వస్తు సామాగ్రి అందించే ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’2024.. మరోసారి జేపీ రోడ్డులో సరికొత్తగా స్థానిక పద్మాలయ థియేటర్స్ ఎదురుగ గ్రౌండ్ లో ఉచిత ప్రదర్శన, పార్కింగ్ మరియు అమ్మకాలు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఎందరో చేతి వృతుల కళాకారులూ రూపొందించిన కాటన్, చేనేత, కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు, సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, ఇంటిని అలంకరించే కళాత్మక అలంకార వస్తువులు, పింగాణిలు, తివాచీలు, వెదురు ఫర్నిచర్, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, వస్త్రాలు దాదాపు 50 స్టాల్స్ తో భారీ ఎత్తున ఏర్పాటు చెయ్యడం జరిగింది. దేశీయ కళాకారుల టాలెంట్,ఐటమ్స్నా ణ్యతను వీక్షించడమే కాదు..వీటి కొనుగోళ్ల, వాడకంతో మన ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు భారీ చాట్ బండార్ లతో పాటు,కుటుంబసమేతంగా ఆస్వాదించవచ్చు.. మన అవసరం మేర కొనుగోలు చేసి చేతి వృత్తి కళాకారుల ఉపాధిని ప్రోత్సహించాలి.
