సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీమవరంలో టౌన్‌రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్ ఆసోషియేషన్ హాలులో నేటి సోమవారం మద్యాహ్నం సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు వై.కేశవరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం హాజరైయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో వరి,ఆక్వాతో సహా అన్ని పంటల రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశానికి అతూ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్వామినాధన్ కమీషన్ సిఫార్సు హామీని బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.. ఢల్లీి వీధుల్లో లక్షల మంది రైతాంగం సంవత్సరం పైగా ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి,కరోనాకు ప్రాణాలు ఎదురొడ్డి గుండె నిబ్బరంతో,ఆత్మస్థైర్యంతో 750మంది రైతులు ప్రాణాలు కోల్పోయి మోడి ప్రభత్వం తెఇచ్చిన నల్లచట్టాలను తిప్పికొట్టారన్నారు. మన దేశంలో ఎగుమతులలో అగ్రగామిగా ఉన్న ఏపీలో ఆక్వా రైతులు ఇటీవల తీవ్ర నష్టాలు ఎదురు కొంటున్నారు. చేపలు, రొయ్యలకు మద్దతూ ధర కల్పించి ఆదుకోవాలి.నాణ్యమైన సీడ్,ఫీడ్ సరఫరా చేయాలి.ఆక్వా రైతులందరికీ విద్యుత్‌రాయితీ పునరుద్ధ్దరించాలి. ఎంపెడా, కేంద్ర వాణిజ్యశాఖ, రాష్ట్ర మత్స్యశాఖలు ఆక్వా రైతుల్ని ఆదుకునే ప్రణాళికలు చేపట్టాలి. తాడేపల్లిగూడెం ఉద్యానవర్శిటీ,వెంకట్రామన్న గూడెం గేదెల పరిశోధన, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం, మత్స్య పరిశోధనా కేంద్రం, మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేయాలి. నరసాపురంలో నిర్మిస్తున్న ఆక్వా యునివర్శిటీ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. అని డిమాండ్ చేసారు
