సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దంగా ప్రజలలో ఒకడిగా మమేకం అయ్యి.. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు నేడు, మొదటిసారిగా భీమవరం వచ్చిన నేపథ్యంలో పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంజిబాబు గారు మాట్లాడుతూ రామానాయుడు గారు మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించి మన జిల్లాకి మంచి పేరు తీసుకొని రావాలని ఆయన ఇంక మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటూ ఆయనను ఘనంగా సత్కరించడం జరిగింది. అంజిబాబు గారు తనకి ఆదర్శమని మేము అయిదు సంవత్సరాలలొ సాధించింది మీరు యాభై రోజులలో సాధించారు అని కొనియాడారు. తదుపరి జనసేన జిల్లా అడ్జక్షులు కొటికలపూడి గోవిందరావు ను కలసి తన విజయానికి జనసేన క్యాడర్ చేసిన కృషిని అభినందిస్తూ ఆయనను శాలువాతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తదుపరి పట్టణ శివారులోని నివాసంలో ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నిమ్మల రామానాయుడును శాలువాతో సత్కరించి మంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో శుభాభినందలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో నిమ్మల ను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విశేషంగా అభినందించారు.
