సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షడు బొండా రాంబాబుఆధ్వర్యంలో 4 ఏళ్ల బాలుడు విహంత్ అర్జున్ కు నెలకు సరిపడే మందులు, ప్రోటీన్స్, పండ్లు అందించారు. లయన్స్క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. బాల్య క్యాన్సర్లు చికిత్సలకు లొంగుతాయని, తల్లితండ్రులు బయపడవల్సిన అవసరం లేదని పిల్లల శరీరం కీమోథెరపీ వంటి చికిత్సలను సమర్థంగా తట్టుకుంటుందన్నారు. సమయానికి చికిత్స చేస్తే నయమయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయని, పిల్లల్లో ధైర్యాన్ని నింపి, మూడు నాలుగు నెలలు చికిత్స చేస్తే మామూలుగా అవుతారన్నారు. మన దేశంలో ఏటా ప్రతి లక్ష మంది పిల్లల్లో సుమారు 12-15 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, అధునాతన చికిత్సల పుణ్యమాని 80-85 శాతం బాల్య క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నారని, సత్వరం సరైన చికిత్స చేయించడం కోసం దాతలు కూడ సహకరించాలి అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శులు అల్లు తులసి ప్రసాద్, గొప్పిశెట్టి మురళి కృష్ణ కోశాధికారి కనగర్ల రామకృష్ణ, భట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..
